Clariant

బొంతపల్లి,  భారత్‌‌ సైట్‌లో కొత్తగా వ్యర్థ జలాల శుద్ధీకరణ ప్లాంట్ ప్రారంభించిన క్లారియెంట్

  • స్థిరత్వంతో విలువను జోడించడం ద్వారా నిరంతర వ్యూహాత్మక దృష్టి
  • నూతన ప్రక్రియ ద్వారా కొత్త ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 300 కిలోలీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేయవచ్చు
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం, శుద్ధీకరించిన జలాలు తాగడానికి అర్హమైనవి

ముంబయి, సెప్టెంబర్ 23, 2019 –దార్శనికత మరియు వినూత్నత కలిగిన స్పెషాలిటీ కెమికల్ కంపెనీగా ప్రసిద్ధి చెందిన క్లారియెంట్ ఈరోజు కొత్తగా భారతదేశంలోని బొంతపల్లిలో ఉన్న తన ఇండస్ట్రియల్ & కంజ్యూమర్ స్పెషాలిటీస్ (ICS) సైట్ వద్ద ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ వ్యర్థ జలాల శుద్ధీకరణ ప్లాంట్‌(WWTP)ను ప్రారంభించింది.

జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సైట్ వద్ద ఉన్న ఈ కొత్త వ్యర్ధ జలాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ ప్రతిరోజూ 300 కిలోలీటర్ల వ్యర్థ జలాలను శుద్ధీకరించే సామర్థ్యం కలగి ఉంది.

ఈ WWTP వ్యర్థ జలాలను విభిన్న దశల్లో శుద్ధీకరించడంతో పాటు హానికారక మలినాలు తొలగించడంలో అత్యంత సమర్థవంతమైన అనేక ప్రక్రియలను కలిగి ఉంది. వ్యర్ధజలాలు WWTP  లోనికి పంపించబడతాయి. ఇక్కడ అవి బయోలాజికల్ ట్రీట్మెంట్, అల్ట్రా ఫిల్ట్రేషన్, రివర్స్ ఆస్మాసిస్, మల్టి ఎవాపోరేషన్ టెక్నిక్స్ మరియు యాజిటేటెడ్ థిన్ ఫిల్మ్ డ్రైయింగ్ వంటి ప్రక్రియలకు లోనవుతాయి. క్లేరియెంట్ తన దృష్టిని స్థిరత్వంపై మరియు పర్యావరణ సంరక్షణపై కొనసాగిస్తూనే బొంతపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వ్యర్థ జలాల శుద్ధీకరణ ప్లాంట్‌తో తన పారిశ్రామిక వినియోగదారుల ప్రత్యేక వ్యాపారం కొరకు అభివృద్ధి వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది.

"క్లారియెంట్ వ్యాపార దృక్పధం తను కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాటాదారులందరికీ మరియు సమాజాలన్నింటి కొరకు ఒక మెరుగైన భవిష్యత్తును సిద్ధంచేస్తుంది. WWTP లో క్లారియెంట్ యొక్క ఈ పెట్టుబడులు తనఅభివృద్ధికి వ్యూహాత్మక మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో స్థిర అభివృద్ధి పట్ల తనకు ఉన్న పట్టుదలకు తార్కాణంగా ఉన్నాయి. భారతదేశంలో బియు పారిశ్రామిక మరియు వినియోగదారుల ప్రత్యేక వ్యాపారంపై మా దృష్టిని మరింత వృద్ధి చేసే లక్ష్యంతో మేమొక ప్రత్యేక వ్యూహాన్ని అవలంబిస్తున్నామని" భారత్‌‌లో క్లారియెంట్‌‌కు రీజనల్ హెడ్‌‌గా వ్యవహరిస్తున్న శ్రీ అద్నాన్ అహ్మద్ అన్నారు.

ఒక పచ్చటి పర్యావరణాన్ని అందించాలనే మా దృష్టికోణంలో ఒక భాగంగా ఈ కొత్త WWTPని ఏర్పాటు చేశాం. మేము అనసరిస్తున్న విలువలను ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా మేము మరొకసారి నొక్కిచెప్పాము. ఇది విజయవంతంగా అమలు జరగడాన్ని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను మరియు మున్ముందు దీని వలన కలిగే ప్రయోజనాల పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాను అని ప్రారంభోత్సవ వేడుకలో అతుల్ శర్మ, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్, బియు, ఐసిఎస్, బొంతపల్లి- అన్నారు.

పర్యావరణం, ఆరోగ్యం మరియు భద్రత (EHS) చర్యలను గుర్తించినందుకు గుర్తుగా CII-SR EHS ఎక్సెలెన్స్ అవార్డ్స్ – 2018 నుంచి బొంతపల్లి సైట్ త్రీ స్టార్ రేటింగ్ సాధించింది. అలాగే, వినియోగదారుల అంచనాలు అందుకోవడానికి మరియు. EU మార్గదర్శకాలతో అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులు మరియు ఉత్పత్తి ప్రమాణాలు అందించడంలో సహాయపడటానికి ఈ సంస్థ  కాస్మోటిక్ GMP దృవీకరణను కూడా కలిగి ఉంది.

Clariant International Ltd
Rothausstrasse 61
4132 Muttenz 1
Switzerland

+41 61 469 6742

www.clariant.com

@clariant

Clariant

ClariantInternational

clariant_international


www.clariant.in

క్లారియెంట్ అనేది ఒక దార్శనికత మరియు వినూత్నత కలిగిన ఒక ప్రత్యేక కెమికల్ కంపెనీ. బాసెల్/ స్విట్జర్లాండ్ దగ్గర్లోని ముటెన్జ్ సమీపంలో ఏర్పాటైంది. 2018 డిసెంబర్ 31 నాటికి ఈ కంపెనీలో మొత్తం 17 901 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2018 ఆర్థిక సంవత్సరంలో, క్లారియెంట్ తన నిరంతర వ్యాపారం ద్వారా CHF 6.623 బిలియన్ల అమ్మకాలు నమోదు చేసింది. కేర్ కెమికల్స్, కేటలైసిస్, నేచురల్ రిసోర్సెస్, మరియు ప్లాస్టిక్స్ & కోటింగ్స్ అనే నాలుగు వ్యాపార విభాగాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆవిష్కరణల మీద దృష్టి మరియు పరిశోధన & అభివృద్ధి, స్థిరత్వంతో విలువ, రీపొజిషన్ పోర్ట్ ఫోలియో, ఇంటెన్సిఫీ వృద్ధి, మరియు వృద్ధి చెందే లాభదాయకత అనేది ఐదు స్తంభాల మీద క్లారియెంట్ కార్పోరేషన్ వ్యూహం ముందుకు సాగుతోంది.

భారతదేశంలో క్లారియెంట్ ప్రధాన కార్యాలయం కొత్త ముంబయ్‌లో ఉంది. కేర్ కెమికల్స్ (BU ఇండస్ట్రీయల్ & కన్జ్యూమర్ స్పెషాలిటీస్), ప్లాస్టిక్స్ & కోటింగ్స్ (BU పిగ్మెంట్స్, BU మాస్టర్ బ్యాచెస్ మరియు BU అడెటీవ్స్), నేచురల్ రిసోర్సెస్ (BU ఫంక్షనల్ మినరల్స్, BL మైనింగ్ సర్వీసులు) మరియు కేటలైస్ట్స్ (BU కేటలైస్ట్స్) అనే వ్యాపార విభాగాల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. భారతదేశంలోని అనేక ప్రదేశాల్లో ఈ కంపెనీ తయారీ యూనిట్లు ఉన్నాయి. మహారాష్ట్రలోని వాషెర్ & రోహా; తమిళనాడులోని కడలూర్; గుజరాత్‌లోని రానియా, నందెసారి &  కలోల్‌; మధ్య ప్రదేశ్‌లోని నగ్దా; తెలంగాణలోని బొంతపల్లి మరియు కేరళలోని ఎడయార్‌లలో ఈ యూనిట్లు ఉన్నాయి. 2018లో, క్లారియెంట్ తన కొత్త గ్రీన్‌ఫీల్డ్ హెల్త్ కేర్ ప్యాకేజింగ్ ప్లాంట్‌ను తమిళనాడులోని కడలూరులో ప్రారంభించింది. భారతదేశంలో నిబద్ధత కలిగిన అప్లికేషన్ సెంటర్లు మరియు అత్యాధునిక రీజనల్ ఇన్నేవేషన్ సెంటర్ (RIC) కలిగిన ఈ కంపెనీ సంబంధిత పరిశ్రమ కోసం ప్రత్యేక పరిష్కారాలు అందించడం లక్ష్యంగా ముందుకెళ్తోంది. RIC అనేది క్లారియెంట్ గ్లోబల్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ లో భాగంగా ఉంటోంది.

Related images

The Waste Water Treatment Plant at the Bonthapally Site, Telangana, India. 
(Photo: Clariant)

 

 

Editorial enquiries

Stefanie NehlsenStefanie Nehlsen
Clariant International Ltd

+41 61 469 63 63

stefanie.nehlsen@​clariant.com

Siria NielsenSiria Nielsen
EMG

+31 164 317 036

snielsen@​emg-marcom.com

@siriajonna

 

Also available in

 

Share

 

More news from